తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోలైన రామ్ చరణ్, విక్రమ్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్న అమీ జాక్సన్ కొన్నాళ్లుగా పర్సనల్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి వ్యవహారాలలో బిజీగా ఉంటుంది. అమీ జాక్సన్ 2015 నుండి 2021 వరకు హోటల్ వ్యాపారి జార్జ్ పనాయోటౌతో రిలేషన్‌షిప్ కొనసాగించింది. అప్పట్లో పెళ్లి కాకుండానే అమీ జాక్సన్ ఒక ఆడబిడ్డను ప్రసవించింది. నిశ్చితార్ధం చేసుకున్న అమీ, జార్జ్ లు 2021లో విడిపోయారు.
ఆ తర్వాత అమీ హాలీవుడ్ యాక్టర్ ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చెయ్యడమే కాదు అతడిని పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత అమీ మరోసారి గర్భం ధరించినట్లు బేబీ బంప్‌ని చూపిస్తూ ఫోటోలను షేర్ చేసిందీ. తాజగా అమీ జాక్సన్ తల్లయ్యింది.
అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టుగా అమీ, జార్జ్ లు ప్రకటించారు. దానితో అమీ జాక్సన్ కి ఆమె అన్నిహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.