యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో ఉన్నారు. అక్కడ దేవర రిలీజ్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా వున్నారు. దర్శకుడు కొరటాల శివ తో కలిసి ఎన్టీఆర్ చాలా స్టయిలిష్ గా అభిమానులతో మింగిల్ అవుతూ, డాన్స్ లు చేస్తూ సినిమాని ప్రమోట్ హేస్తున్నారు. ఎన్టీఆర్ కి జపాన్ లో ఉన్న క్రేజ్ చూస్తే దేవర అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమంటున్నారు నిపుణులు.
ఈ నెల 28 న ఎన్టీఆర్ జపాన్ పర్యటన ముగించుకుని ఇండియాకి వస్తారు. ఆ మరుసటి రోజే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న NTR31 షూటింగ్ సెట్ లోకి వెళతారని తెలుస్తోంది. జపాన్ నుంచి రాగానే ఎన్టీఆర్ ఉగాది, రంజాన్ పండుగలను సెలెబ్రేట్ చేసుకుని ఆ తర్వాతే నీల్ మూవీ సెట్ లో అడుగుపెడతారని అనుకున్నారు.
కానీ ఎన్టీఆర్ జపాన్ నుంచి రాగానే ఇమ్మిడియట్ గా నీల్ తో జత కడుతున్నారట. హైదరాబాద్ లో హీరో లేని సన్నివేశాల షెడ్యుల్ ముగించిన ప్రశాంత్ నీల్ సెకండ్ షెడ్యూల్ ని బెంగుళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో షూటింగ్ లొకేషన్ ని సెట్ చేశారట, ఆ షెడ్యూల్ లోనే ఎన్టీఆర్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.