ఇటీవల ప్రభాస్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ మార్కెట్‌లోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. సలార్ రీ రిలీజ్‌తో అభిమానుల్లో నూతన ఉత్సాహం పెరిగింది. ఈ హై ఎనర్జీని మరింత పెంచేలా ది రాజాసాబ్ సినిమా రాబోతుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. ఈసారి ప్రభాస్‌ను పూర్తిగా మాస్ అవతారంలో చూపించేందుకు మారుతి ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నప్పటికీ.. ఇందులో హార్రర్, కామెడీ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి.
ఇప్పటికే ప్రభాస్ లుక్‌పై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఓ కింగ్ లుక్‌కి హార్రర్ టచ్ జోడించడం ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచింది. తాజాగా మేకర్స్ ఓ రఫ్ టీజర్ కట్ సిద్ధం చేసి కొంతమందికి ప్రివ్యూ చేసినట్లు సమాచారం. టీజర్‌లో ప్రభాస్ చెప్పిన ఓ పవర్‌ఫుల్ డైలాగ్ త్వరలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే అవకాశముందని వినిపిస్తోంది. అంతే కాదు ఇందులో ఓ ప్రత్యేక షాట్ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ షాట్‌లో థ్రిల్, స్టైల్, డ్యాన్స్ స్టెప్ ఇలా ఆల్ ఇన్ వన్ గా ఉండటంతో మారుతి సృజనాత్మకతకు అద్దం పడుతుందని చెప్పుకుంటున్నారు. ఇది ఫ్యాన్స్‌లో పూనకాలెత్తేలా ఉందని ఫీడ్‌బ్యాక్ రావడంతో మేకర్స్ టీజర్ విడుదల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ది రాజాసాబ్ టీజర్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనంతరం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి ఫైనల్ పార్ట్ అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మొదట్లో మారుతి ప్రభాస్ కాంబినేషన్‌పై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ టీజర్ రఫ్ కట్ చూసిన వారంతా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, మాస్ లుక్ అన్నీ కలిపి ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించబోతున్నారని అంటున్నారు. ఈ టీజర్ ఎప్పుడు వస్తుందా..? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.