Advertisementt

అఖిల్ లైనప్ పెరుగుతోంది

Tue 25th Mar 2025 10:26 AM
akhil  అఖిల్ లైనప్ పెరుగుతోంది
Akhil- Nandu combo on cards అఖిల్ లైనప్ పెరుగుతోంది
Advertisement
Ads by CJ

సామజవరగమన పాటతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న నందు ఇప్పుడు దర్శకుడిగా తన ప్రయత్నాలను వేగంగా కొనసాగిస్తున్నాడు. గతంలో వెంకటేష్‌కి ఓ కథ చెప్పగా అది ఆయనకు నచ్చిందని సమాచారం. సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయం సాధించడంతో వెంకటేష్ కొంత డైలామాలో పడ్డారు. ఈ హిట్‌ని నిలబెట్టుకోవాలంటే మంచి కాంబినేషన్‌తో సినిమాను చేయాలనే ఆలోచనకు వచ్చారు. అందుకే నీ కథ బాగుంది కానీ వేరే దర్శకుడితో తీయొచ్చా..? అని వెంకటేష్ అడిగినట్లు సమాచారం. అయితే నందు తాను స్వయంగా డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు నందు తన కొత్త కథను అఖిల్‌కు వినిపించినట్లు సమాచారం. అఖిల్ కూడా ఈ కథపై ఆసక్తి చూపిస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇది వెంకటేష్‌కు చెప్పిన కథ కాదట పూర్తిగా కొత్త స్టోరీని నందు అఖిల్ కోసం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత నందుతో అఖిల్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. అఖిల్ నందు కాంబినేషన్‌కి నిర్మాతగా శ్రీనివాస చిట్టూరి వ్యవహరించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నందు ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.

Akhil- Nandu combo on cards:

Akhil next finalised 

Tags:   AKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ