మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చి చేజారితే ఎంత పెయిన్ ఉంటుంది. ఇపుడు ఓ కుర్ర డైరెక్టర్ చిరుతో చేసే సినిమా ఎలా మిస్ అయ్యిందో చెప్పి షాకిచ్చారు. భీష్మ హిట్ తర్వాత వెంకీ కుడుములు చిరు కి కథ చెప్పించి ఒప్పించగా, చిరు తో వెంకీ సినిమా ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అనుకున్న సమయంలో ఆ సినిమా ఆగిపోయింది.
తాజాగా వెంకీ కుడుములు రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో తనకు మెగాస్టార్ తో అవకాశం చేజారిన విషయాన్ని రివీల్ చేసారు. భీష్మ సినిమా తర్వాత చిరంజీవి గారి కోసం ఒక కథ అనుకున్నాను. సినిమా కి సంబంధించి ఫస్ట్ ఐడియా చెప్తే మెగాస్టార్ చాలా ఎక్సైట్ అయ్యారు. నేను చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్ ని.
చిరంజీవి గారితో చేసే సినిమా చాలా ప్రత్యేకంగా వుండాలని స్టోరీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కి చాలా సమయం తీసుకుని దానిపై వర్క్ చేశాను. కానీ ఎక్కడో ఓ చోట నేను ఆయన్ని మెప్పించలేపోయాను. దానితో మరో కథతో వస్తానని చెప్పి ఆయన దగ్గర నుంచి వచ్చేశాను అంటూ వెంకీ కుడుములు చిరు తో సినిమా ఎలా చేజారిపోయిందో చెప్పారు.