గత వారం విడుదలైన చిత్రాలు అన్ని చిన్న చిత్రాలే. అవేమి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. ఇక ఈ వారం ఉగాది స్పెషల్ గా కొన్ని క్రేజీ చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. స్ట్రయిట్ సినిమాలు vs డబ్బింగ్ చిత్రాలు అన్న రేంజ్ లో ఈ వారం బాక్సాఫీసు జాతర ఉండబోతుంది.
అందులో నితిన్-వెంకీ కుడుములు రాబిన్ హుడ్, నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ల మ్యాడ్ స్క్వేర్, ఇంకా మలయాళం నుంచి మోహన్ లాల్-పృథ్వీ రాజ్ సుకుమారన్ ల ఎల్ 2 : ఎంపురాన్, చియాన్ విక్రమ్ వీర ధీర శూర, సల్మాన్ ఖాన్-రష్మిక ల సికిందర్ చిత్రాలు ఈ శుక్రవారం నుంచి ఆదివారం వరకు థియేటర్స్ లో విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రాబోయే చిత్రాలు, సిరీస్‌లు
ఆహా:
ది ఎక్స్‌టార్డనరీ జర్నీఆఫ్ ది ఫకీర్ (తెలుగు) మార్చి 26
జీ5:
విడుదల పార్ట్-2 (హిందీ) మార్చి 28
నెట్‌ఫ్లిక్స్:
మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) మార్చి 26
అమెజాన్ ప్రైమ్:
హాలెండ్ (ఇంగ్లీష్) - మార్చి 27 నుంచి స్ట్రీమింగ్
జియో హాట్‌స్టార్:
ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) - మార్చి 26