జనసేన పార్టీ విషయంలో గత పదేళ్లుగా నిరాశలో కూరుకుపోయిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలో జనసేన పార్టీకి ఎనలేని వైభవాన్ని తేవడమే కాదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కీలకంగా మారారు. డిప్యూటీ సీఎం గా, ఇంకా ఇతర శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోపక్క పార్టీని బలోపేతం చేస్తున్నారు. రీసెంట్ గానే జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ నేషనల్ వైడ్ గా పలు పాయింట్స్ ని టచ్ చేసారు.
హిందీ vs తమిళ్ పై పవన్ ఆ సభలో కీలక కామెంట్ చేసారు. తాను స్వచ్చందంగానే తమిళం, హిందీ నేర్చుకున్నాను అన్నారు. చాలామంది నేతలు పలువురు హిందీ భాషలో ప్రసంగాలు చేస్తుంటారు. కానీ హిందీని వ్యతిరేకిస్తుంటారు, ఇంగ్లీష్ మాదిరి హిందీ కూడా నేర్చుకుంటే మంచింది.
తాజాగా పవన్ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళ ప్రజలు ఆదరణ చూపిస్తే తమిళనాడులో కూడా జనసేనను రంగంలోకి దింపుతామని తెలిపారు. పార్టీకి ఇతర రాష్ట్రాలలోనూ అభిమానులు ఉన్నారని, అందుకే ఇలాంటి ఆలోచన అంటూ తన నేషనల్ వైడ్ ఆలోచనలు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.