సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించడం తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన అనుభవమని రష్మిక మందన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె సికందర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఈద్ కానుకగా మార్చి 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రష్మిక సల్మాన్‌తో కలిసి పని చేసిన అనుభవాలను షేర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌తో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. సల్మాన్ సర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప విషయం. నా కెరీర్‌లో ఇంతటి అవకాశం రావడం నిజంగా గర్వించదగిన విషయం. ఎనిమిదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మురుగదాస్ గారి దర్శకత్వంలో నటించాలని కోరుకున్నా.. ఆయన సినిమాల్లో స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలు ప్రత్యేకంగా ఉంటాయి. సికందర్ సినిమాలో అవకాశం దక్కడం నాకు గొప్ప ఆనందాన్ని కలిగించింది. నన్ను సంప్రదించినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయా అని రష్మిక అన్నారు.
అంతేకాదు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో కలిసి నటించడం తనకు మరింత ఆనందంగా ఉందని రష్మిక తెలిపారు. కాజల్ గారితో స్క్రీన్ పంచుకోవడం ప్రత్యేకమైన అనుభూతి. భవిష్యత్తులోనూ ఆమెతో కలిసి నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్సులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా సల్మాన్, రష్మికల డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
దర్శకుడు మురుగదాస్ సికందర్ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించగా.. ఇందులో ఎన్నో ట్విస్ట్‌లు, స్పెషల్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని తెలిపారు. ప్రేక్షకులకు ఇది ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్ అవుతుందని సినిమా విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా.. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎంత భారీ విజయం సాధిస్తుందో చూడాలి.