పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి నటించి టాలీవుడ్ కి ఎప్పుడెప్పుడు గ్రాండ్ ఎంట్రీ ఇద్దామా అని కలలు కన్న మలయాళ కుట్టి మాళవిక మోహనన్ కి రాజా సాబ్ పోస్ట్ పోన్ అవడం కాస్త కష్టంగా ఉంది. కానీ మాళవిక మోహనన్ మాత్రం ప్రభాస్ మంచి తనం గురించి ఎప్పటికప్పుడు ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
గతంలో ప్రభాస్ గురించి చెప్పిన మాళవిక ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే ఫుడ్ తింటే అచ్చం అమ్మ వండిపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటూ చెప్పి ప్రభాస్ గొప్పదనం గురించి చెప్పింది. ఆమె తాజాగా మరోసారి ప్రభాస్ గురించి చెప్పి అభిమానులను ఖుషి చేసింది.
ప్రభాస్ తో కలిసి నటించడం నా అదృష్టం. అసలు నా కెరీర్ లోనే ప్రభాస్ తో కలిసి సినిమా చేయడం నాకు ఓ మైలు రాయి అంటూ ప్రభాస్ ని తెగ పొగిడేసింది. మరి రాజా సాబ్ లేట్ అయినా హీరోయిన్స్ ప్రభాస్ విషయంలో చేస్తున్న కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు.