ఈమధ్యన సినిమా ఫంక్షన్స్ లో కొంతమంది నటులు చేస్తున్న కామెంట్స్ ఆ సినిమాల విడుదలకు ఎఫెక్ట్ అవుతున్నాయి. నటుడు పృథ్వీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియాలో లైలా ను బాయ్ కాట్ చెయ్యాలని పిలుపునిచ్చింది. పృథ్వీ సారీ చెప్పేవరకు ఆ హ్యాష్ ట్యాగ్ నడిచింది.
ఇప్పుడు నితిన్-వెంకీ కుడుములు కాంబోలో వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో నటించిన ప్రముఖ క్రికెటర్ చనువుగా సరదాగా అన్న మాటలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఆ కామెంట్స్ వార్నర్ అభిమానులకు కోపాన్ని తెప్పించాయి.
డేవిడ్ వార్నర్ వలన రాబిన్ హుడ్ కి హెల్ప్ అవ్వడమేమో కానీ ఎఫెక్ట్ అవ్వదు కదా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. గత రెండు రోజులుగా రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో డేవిడ్ వార్నర్ తెగ హైలెట్ అవ్వడంతో రాబిన్ హుడ్ పై అంచనాలు పెరిగాయి.
కానీ ఇప్పుడు అదే డేవిడ్ వార్నర్ పై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వలన సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో తెలియక మేకర్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.