మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25 పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు నెలలుగా మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే రాజమౌళి లాంటి డైరెక్టర్స్ సినిమాలకొచ్చే బజ్ కన్నప్ప విషయంలో క్రియేట్ అవ్వడం లేదు అనే వాదన ఉంది.
ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు, అసలు ట్రేడ్ లో కన్నప్ప పై అంచనాలు ఎలా ఉన్నా తాజాగా ఈ చిత్రంలో నటించిన నటుడు రఘుబాబు కన్నప్ప సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు.
ఇది గుర్తు పెట్టుకోండి. ఎవరైనా సరే శివుడు ఆగ్రహానికి గురవ్వడం ఖాయం, ఇది 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరి నిజంగా కన్నప్ప ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే శివుడు కోపానికి బలవ్వాల్సిందేనా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.