అక్కినేని ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ప్రొఫెషనల్ గా ఎంత మోడ్రెన్ గా ఉన్నా, ఆమె కుటుంబ పరంగా చాలా సాంప్రదాయంగా కనిపిస్తుంది. రీసెంట్ గా భర్త నాగ చైతన్య తో కలిసి వోగ్ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శోభిత చైతు తో కలిసి ఫోటోషూట్ చేయించుకొగా అవి తెగ వైరల్ అయ్యాయి.
అవి ఇంకా ట్రెండ్ అవుతున్న సమయంలోనే అక్కినేని వారి కోడలు శోభిత తమిళనాడు ట్రిప్ వేసింది. ఆ ట్రిప్ లో తంజావూరు సమీపంలో ఉన్న కుంభకోణం టెంపుల్ లో కనిపించింది. అక్కడ కుంభకోణం దేవాలయాన్ని సందర్శించిన ఫొటోస్ ని తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది.
చుడిదార్ లో శోభిత గుడిలో కలయదిరుగుతూ సందడి చేసింది. ఆ గుడిలో శోభిత చాలా ప్రశాంతంగా కనిపించింది. ప్రస్తుతం శోభిత కుంభకోణం టెంపుల్ ని సందర్శించిన పిక్స్ వైరల్ అయ్యాయి.