పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసాక ఇకపై సినిమాలు చెయ్యరనే ఆందోళనలో పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన పూర్తి చెయ్యాల్సిన మూడు సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియక నిర్మాతలు కిందా మీదా అవుతున్నారు. అందుకే అవి పూర్తి చేసాక పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తారని అనుకుంటున్నారు.
తాజాగా ఆయనకి ఓ ఇంటర్వ్యూలో అదే ప్రశ్న ఎదురైంది. మీరు రాజకీయాలతో బిజీ అయ్యారు. ఇకపై సినిమాలు చెయ్యరా అన్న ప్రశ్నకు పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవ్వడం కాదు వారు సంబరాలు చేసుకుంటున్నారు. డబ్బు అవసరం ఉన్నంత కాలం తను సినిమాలు ఆపనని స్పష్టం చేసారు.
అయితే అటు పాలిటిక్స్, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళతాను అని, పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండా ఉండేలా రాజకీయాలను, సినిమాలను ప్లాన్ చేస్తానని చెప్పారు. గతంలోనూ తాను సినిమాలు చేస్తుంది డబ్బు కోసం. ఆ డబ్బుని ప్రజల సహాయం కోసం వాడుతాను అని చెప్పారు. ఇప్పుడు కూడా పవన్ అదే మాటమీదున్నారు. కాకపోతే సినిమాలు చెయ్యను అనలేదు, చేస్తా అన్నారు కాని అదెలా సాధ్యమవుతుందో అనేది స్పష్టత లేదు.