తెలంగాణలో ముఖ్యంగా సోషల్ మీడియా లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సినిమా నటులు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్స్ పై అక్కడక్కడా కేసులు నమోదు అవుతున్నాయి. అందులో భాగంగా పోలీసులు వారిని విచారణకు రావల్సిందిగా నోటీసులు ఇస్తున్నారు.
ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విష్ణు ప్రియా, రీతూ చౌదరిలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ కేసులో తనని అరెస్ట్ చెయ్యవద్దు అంటూ క్వాష్ పిటిషన్ వేసిన యాంకర్ శ్యామలకు కోర్టులో ఊరట లభించినా విచారణ తప్పట్లేదు. శ్యామలను అరెస్టు చేయొద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసినా.. విచారణకు సహకరించాల్సిందిగా ఆమెకు చెప్పింది.
కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సోమవారం ఉదయం యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విచారణకు వెళ్ళింది, మొహం కనిపించకుండా ఆమె విచారణకు వెళుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి, మరి శ్యామలను ఈ కేసులో ఎంతసేపు ప్రశ్నిస్తారో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.