మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్ డే కి ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న RC16 నుంచి ఓ మాంచి ట్రీట్ ని మెగా ఫ్యాన్స్ కి అందడం పక్కా అంటూ సోషల్ మీడియాలో వస్తోన్న న్యూస్ లు చూసి మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా గాల్లో తేలుతున్నారు. బుచ్చి బాబు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం RC 16 గ్లింప్స్ సిద్ధం చేస్తున్నారని అన్నారు.
అంతలోనే RC 16 నుంచి గ్లింప్స్ రాకపోవచ్చు, ఇది మెగా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసే న్యూస్ అంటూ సోషల్ మీడియాలో మరో వార్త చూసి నిజంగా మెగా ఫ్యాన్స్ నిరాశపడిపోతున్నారు. గత రెండేళ్లలో దర్శకుడు శంకర్ మెగా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ అయ్యేలా చేసారు, ఇప్పుడు బుచ్చిబాబు కూడా అలా చేస్తారా అంటూ వారు టెన్షన్ పడుతున్నారు.
మరి రామ్ చరణ్ - బుచ్చి బాబు కాంబో RC 16 నుంచి ఆ ట్రీట్ ఇచ్చేందుకు ఏమి అడ్డంకులు ఉన్నాయో అనేది వాళ్లకు అవసరం లేదు, కానీ బర్త్ డే రోజున ట్రీట్ ముఖ్యం. అందుకే వారు అంతలా డిజప్పాయింట్ అవుతున్నారు. మరి పెద్ది టైటిల్ తో పోస్టర్ వదిలి మేకర్స్ సరిపెడతారేమో అంటూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.