OG చిత్రంతో టాలీవుడ్ లో పాతుకుపోదామని తెగ కలలు కన్న ప్రియాంక మోహన్ కి ప్రస్తుతం ఎదురు చూపులే మిగులుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు సెట్ లోకి వస్తారు, ఎప్పుడు OG పూర్తి కావాలి అనేది అర్ధం కావడం లేదు. దర్శకుడు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిటింగ్.
ఇక ప్రియాంక మోహన్ OG తో హిట్ కొడితే రేంజ్ మారుతుంది అనుకుంటే.. అదేమో ఇలా అవుతుంది. ఇక కోలీవుడ్ సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ అప్పుడప్పుడు కాస్త యాక్టీవ్ గా ఫొటోస్ షేర్ చేస్తుంది. సాంప్రదాయంగా కనిపించే ప్రియాంక మోహన్ షేర్ చేసే పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి.
తాజాగా ప్రియాంక మోహన్ ఫ్లోరల్ ప్రింట్ శారీ లో తమకంగా ఫోటో లకు ఫోజులిచ్చింది. ఆ సిల్క్ శారీ లో ప్రియాంక మోహన్ బ్యూటిఫుల్ గా కాదు అద్భుతంగా కనిపించి కనువిందు చేసింది. అది చూసి అందరూ పవన్ కళ్యాణ్ కోసం ప్రియాంక వెయిటింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.