సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశీ ఎప్పుడు డిఫ్రెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు, కానీ కొంతమంది తిక్క తిక్కగా ఆలోచిస్తాడు అంటారు. తన సినిమాకు ప్రెస్ వాళ్లకు ప్రీమియర్ షోస్ వేసి వారు ఇచ్చే రివ్యూలతో సినిమాను చంపుకోలేను, వాళ్ళిచ్చే రేటింగ్ తో సినిమాకి ఎఫెక్ట్ తెచ్చుకోలేను అని ఆయన తన సినిమాలకు కొంత కాలముగా స్పెషల్ ప్రెస్ ప్రీమియర్స్ వెయ్యడం ఆపేసారు.
టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ ఇలా ఆయన నిర్మించిన సినిమాలకు ప్రెస్ వాళ్లకు ముందుగా షోస్ వెయ్యకుండా సినిమా విడుదలైన రోజు నైట్, లేదంటే నెక్స్ట్ డే నో స్పెషల్ గా ప్రెస్ రిపోర్టర్స్ ఫామిలీస్ కి షోస్ వేసేవారు నాగవంశీ. కానీ ఇప్పుడు నాగవంశీ రూటు మార్చారు.
అంటే ఆయన నిర్మాణంలో తెరకెక్కి రేపు శుక్రవారం రిలీజ్ కాబోతున్న మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ముందుగానే అంటే మార్చ్ 28 విడుదలయ్యే రోజు ఉదయం 8 గంటలకే ప్రెస్ ప్రిమియర్ వేస్తున్నట్టుగా దానికి ఆహ్వానం కూడా తన పిఆర్ టీమ్ తో ఇప్పించడం చూసి నాగవంశీ రూటు మార్చారు అంటూ ప్రెస్ పీపుల్ కామెంట్స్ చేస్తున్నారు.