మరో నాలుగు రోజుల్లో మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. ఆ రోజు రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం RC 16 నుంచి స్పెషల్ అప్ డేట్ ని సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు బుచ్చి బాబు. ఈసారి రామ్ చరణ్ బర్త్ డే అన్నిటికన్నా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట RC 16 మేకర్స్.
మార్చ్ 27న RC 16 నుంచి గ్లింప్స్ రాబోతున్నట్టుగా సమాచారం. RC 16 గ్లింప్స్ ని ఇప్పటికే వీక్షించిన కొంతమంది బుచ్చిబాబు మేకింగ్ స్టయిల్ ని తెగ మెచ్చేసుకుంటున్నారు. బుచ్చిబాబు కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది అంటున్నారు. ఈ గ్లింప్స్ ఖచ్చితంగా అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంది అనే ధీమాలో కనిపిస్తున్నారు.
రామ్ చరణ్ అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యందు పై ప్రస్తుతం బుచ్చిబాబు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ రామ్ చరణ్ కి జోడిగా నటించనుంది.