మార్చ్ 24 అక్కినేని ప్రిన్స్ అఖిల్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడమే కానీ అక్కినేని ఫ్యామిలిలో ఎలాంటి చప్పుడు కనిపించడం లేదు. గత ఏడాది నవంబర్ లో అఖిల్ ఎంగేజ్మెంట్ జైనబ్ తో జరిగినపుడు అఖిల్ పెళ్లి మార్చ్ లో ఉంటుంది అనే టాక్ నడిచింది. నాగ చైతన్య పెళ్లి తర్వాత వెంటనే అఖిల్ పెళ్లి చెయ్యకుండా నాగ్ కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు అన్నారు.
మార్చ్ 24 అంటే రేపే అఖిల్ పెళ్లి జరగాల్సి ఉంది. అంటే అది సోషల్ మీడియా టాక్ ప్రకారమైతే. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్ పెళ్లి విషయమై ఎలాంటి వార్తా లేదు. అసలు పెళ్లి పనులు మొదలయ్యాయా అనే చప్పుడు కనిపించడం లేదు, నాగార్జున చిన్న కొడుకు పెళ్లి ఖచ్చితంగా అంగరంగ వైభవముగా చేస్తారు ఇది పక్కా.
అది హైదరాబాద్ లోనా లేదంటే జైనబ్ కోసం దుబాయ్ లో చేస్తారా అనేది తెలియాలి, అసలు అఖిల్ పెళ్లి ఎప్పుడు, ఏ తేదిన చెయ్యబోతున్నారు, దానికి ఎంతమంది హాజరవుతారు, నాగ్ అఖిల్ వివాహాన్ని ఎలా, ఎక్కడ చెయ్యబోతున్నారు ఇన్ని డౌట్స్ తో అక్కినేని అభిమానులు కనిపిస్తున్నారు.