బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న RC16 (వర్కింగ్ టైటిల్) షూటింగ్ హైదరాబాద్ నడి బొడ్డున భూత్ బంగళాలో జరుగుతుంది. ఈ చిత్రంలో ఆట కూలీగా కనిపించనున్న రామ్ చరణ్ పై బుచ్చి బాబు హెవీ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. దీని కోసం కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హైదరాబాద్ వచ్చారు.
నిన్న హైదరాబాద్ లోని పెద్దమ్మ గుడిలో శివరాజ్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్న ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్, శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యందు శర్మ కాంబోలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను బుచ్చి బాబు ప్లాన్ చెయ్యడమే కాదు, ప్రస్తుతం ఆ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో ఆయన బిజీగా వున్నారు.
అంతేకాకుండా హీరోయిన్ - హీరో లపై కూడా కొన్ని కీలక సన్నివేశాల ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరిస్తారని తెలుస్తుంది. రామ్ చరణ్ బర్త్ డే మార్చ్ 27 న RC 16 నుంచి ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ రివీల్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.