హైదరాబాద్ లో ఎక్కడ ఏ సెలెబ్రిటీ పార్టీ జరిగినా టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలైన నమ్రత శిరోద్కర్, ఉపాసన ఉండాల్సిందే. రామ్ చరణ్ కానీ మహేష్ కానీ హాజరు కాకపోయినా, లేదంటే మహేష్, రామ్ చరణ్ లతో కలిసి అయినా నమ్రత, ఉపాసనలు ఖచ్చితంగా పాల్గొంటారు. ఎన్టీఆర్ వైఫ్, అల్లు అర్జున్ భార్యలు రేర్ గా కనిపించినా నమ్రత, ఉపాసన మాత్రం ప్రతి ఒక్క ఈవెంట్ లో కనిపిస్తారు.
అందుకే అనేది హైదరాబాద్ లో ఏ సెలెబ్రిటీ ఈవెంట్ అయినా ఈ ఇద్దరూ ఉండాల్సిందే అని. ఉపాసన ఇంకా కొంతమంది కలిసి గత రాత్రి నమ్రత ఇచ్చిన ఇఫ్తార్ పార్టీకి అటెండ్ అయ్యారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో నమ్రత గ్రాండ్ గా ఇఫ్తార్ పార్టీ ఆరెంజ్ చెయ్యగా ఆ ఈవెంట్ లో రామ్ చరణ్, మహేష్ భార్యలు, ఇంకా కొంతమంది స్నేహితులతో కలిసి సందడి చేసారు.
అంతేకాకుండా నమ్రత తన సోషల్ మీడియాలో పేజీ లో ఇది నా మొదటి ఇఫ్తార్ పార్టీ, నిజంగా చాలా ఎంజాయ్ చేసాం My first Iftaar party and I’m truly amazed by the beauty of this celebration! Grateful for a wonderful night filled with fabulous food and even better company! 💛✨ అంటూ ఉపాసన ఇంకా నమ్రత తన ఫ్రెండ్స్ తో ఉన్న పిక్స్ షేర్ చేసింది.