యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవుతారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కి ఎప్పుడు ప్యాకప్ చెబుతారా అప్పుడు నీల్ తో సెట్స్ లోకి వెళ్తారనేది వారి ఆలోచన. ఇప్పటికే హీరో లేని సన్నివేశాలను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ - నీల్ కలిసి నైట్ మీటింగ్ పెట్టిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఇద్దరూ కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని మాట్లాడుకుంటున్న పిక్ వైరల్ కాదు సంచలనం కలిగించింది. ఎన్టీఆర్ ఇంట్లోనే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్న పిక్ అది.
అతి త్వరలోనే అంటే ఈ ఉగాదికి ముందే ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక వార్ 2 కి వచ్చే ఆగష్టు 14 న రిలీజ్ డేట్ ఇస్తే, ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.