నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ తో తెగ ఫేమస్ అయిన అన్వేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోగా మారాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని చట్టానికి పట్టిస్తున్నాడు. వారు ప్రమోట్ చేసే యాప్ ల పేర్లతో సహా, ప్రమోట్ చేసిన వీడియోలను ప్రూఫ్ లతో సహా బయటపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
భయ్యా సన్నీ యాదవ్ దగ్గర నుంచి ఇమ్రాన్, హర్ష సాయి ఇలా చాలామంది పేర్లను అన్వేష్ బయటపెట్టాడు. దానితో వారిపైకేసులు నమోదు అయ్యాయి. భయ్యా సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసారు పోలీసులు, మరోపక్క హర్ష సాయి, ఇమ్రాన్ లు తప్పించుకున్నారు. ఇంత మంచి చేసిన నా అన్వేషణ అన్వేష్ పై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
కారణం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ తల్లులపై నా అన్వేషణ అన్వేష్ అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు అన్వేష్ ని తప్పుపట్టేలా చేసాయి. కొడుకులు తప్పు చేస్తే తల్లిని ఎందుకు అంటున్నాడంటూ అన్వేష్‌పై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. మరి బెట్టింగ్ యాప్స్ భాగోతాన్ని బయటపెట్టిన అన్వేష్ వారి తల్లులపై అలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా ఉండాల్సింది అనేది పలువురి వాదన.