చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెల అంటే ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన పోసాని పై ఏపీ వ్యాప్తంగా ఏకంగా 17 కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చినా చివరి నిమిషంలో ఏపీ సీఐడీ పోలీసులు మరోసారి పోసాని కి షాకిస్తూ అరెస్ట్ చెయ్యడంతో ఆయన కొద్దిరోజులుగా గుంటూరు జైలులోనే ఉన్నారు.
పదే పదే బెయిల్ కి అప్లై చేసి బెయిల్ పొందిన పోసానికి ఏపీ పోలీసులు మోక్షం కలిగించలేదు. ఫైనల్ గా పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుండి విడుదలయ్యారు. పోసానికి నిన్న గుంటూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని పోసానిని ఈరోజు జైలు నుంచి విడుదల చేసారు.
పోసానిని జైలు నుంచి వైసీపీ నేత అంబటి రాంబాబు రిసీవ్ చేసుకుని కారులో తీసుకెళ్లిపోయారు. అయితే రెండు వారాలకు ఒకసారి సీఐడీ కార్యాలయంలో పోసాని సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది