రీసెంట్ గానే చంద్రబాబు మరో 15 యేళ్ళు సిఎం గా ఉండాలని కోరుకుంటున్నాను, ఆయన నాయకత్వంలో పని చెయ్యడానికి ఎప్పుడు సిద్దమే అన్న పవన్ కళ్యాణ్ మరోసారి చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు పవన్ భూమిపూజ చేసిన తర్వాత అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబే కారణమని, ఆయనని స్ఫూర్తిగా తీసుకుని తనకి అప్పగించిన శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను అని, రాష్ట్రం బావుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారు, చంద్రబాబే తనకు స్ఫూర్తి అని, ఆయన స్ఫూర్తితోనే తాను పని చేస్తున్నానని పవన్ కళ్యాణ్ మరోసారి చంద్రబాబు పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
ఏపీ కష్టాల్లో ఉన్నప్పుడు కూటమిని భారీ మెజారిటీతో గెలిపించారు. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.