మలయాళంలో భారీ విజయం సాధించిన ప్రేమలు సినిమా తెలుగులోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఎస్‌ఎస్ కార్తికేయ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ చిత్రం తెలుగు యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా విజయం తర్వాత హీరోయిన్ మమిత బైజు టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు చిత్రసీమ నుంచి ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె ఎంపిక చేసే ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ నటిస్తున్న జన నాయగన్ చిత్రంలో మమిత ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ గా ప్రచారంలో ఉండగా.. ఇందులో మమిత శ్రీలీల పాత్ర తరహా కీలక పాత్రలో కనిపించనుందనే టాక్ ఉంది.
ఇక తాజా సమాచారం ప్రకారం సూర్య - హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. మొదట సూర్య సరసన భాగ్యశ్రీ బోర్సే ను తీసుకోవాలని అనుకున్నా.. చివరికి మమిత బైజు ఈ అవకాశం దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సూర్య ప్రస్తుతం వాడివాసల్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నప్పటికీ.. ఈ సినిమా ఆలస్యం కావడంతో ముందుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మమిత ఇప్పటికే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా ద్వారా ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.