హీరోయిన్ మీనాక్షి చౌదరి గత ఏడాది ఈ సమయంలో గుంటూరు కారం దెబ్బకి సైలెంట్ అయ్యింది. గుంటూరు కారం సినిమా రిజల్ట్ తో డిజప్పాయింట్ అవడం కాదు, ఆ చిత్రంలో ఆమె కేరెక్టర్ చూసి ఆమెకే నిరాశ కలిగి ఉంటుంది. ఆతర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ GOAT కూడా మీనాక్షి చౌదరిని ఇరకాటంలో పడేసింది.
ఆ తర్వాత లక్కీ భాస్కర్ తో 100 కోట్ల హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకి లక్కీ హీరోయిన్ గా కనిపించింది. అయితే మీనాక్షి చౌదరి ఆశించిన అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు తప్పితే ఆమె కి టాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ లేదు.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ లుక్స్ ని పోస్ట్ చేసే మీనాక్షి చౌదరి ఎక్కువగా గ్లామర్ కే ప్రాధాన్యత ఇస్తుంది. మీనాక్షి తాజాగా రెడ్ డ్రెస్ లో మోడ్రెన్ గా కనిపించింది. చూపులతో కాల్చేస్తుందా అన్నట్టుగా మీనాక్షి లేటెస్ట్ లుక్ ఉంది. ప్రస్తుతం మీనాక్షి రెడ్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.