ఇప్పటి తరం టాలీవుడ్ హీరోయిన్లలో రష్మిక మందన్నా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కిర్రాక్ పార్టీ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రష్మిక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో కలిసి నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనివల్ల ఆమె నేషనల్ క్రష్‌గా మారి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
ప్రస్తుతం రష్మిక క్రేజ్ దేశవ్యాప్తంగా మరెవరికి లేకుండా పోయింది. ఆమె నటించిన ప్రతి సినిమా భారీ స్థాయిలో విజయాలు సాధించడం, ప్రేక్షకుల ఆదరణ పొందడంతో లక్కీ హీరోయిన్ అనే పేరు సంపాదించుకుంది. పుష్ప సినిమా ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో చేసిన యానిమల్ మూవీ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప 2 మీద ఆసక్తి మరింతగా పెరుగుతుండగా రీసెంట్‌గా బాలీవుడ్‌లో చేసిన ఛావా సినిమా కూడా ఘనవిజయం సాధించింది.
ఈ విజయాల నేపథ్యంలో రష్మిక తరువాతి సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలోనే సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్న కుబేరలో రష్మిక నటిస్తోంది. అంతేకాదు ఆమె నటించిన గర్ల్‌ఫ్రెండ్ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రెయిన్ బో అనే మరో సినిమాలో కూడా రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ విజయం క్రేజ్ చూసి మిగతా హీరోయిన్లు ఆశ్చర్యపడే స్థాయిలో రష్మిక ఉన్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె స్థాయిని చేరుకోవడం ఇతర హీరోయిన్లకు చాలా వరకు కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.