రాజమౌళితో వర్క్ చెయ్యడమంటే హీరోల సరదా తీరిపోతుంది. అదే విషయాన్ని ప్రభాస్, ఇటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు రాజమౌళితో సినిమా కమిట్మెంట్ పూర్తయ్యేవరకు ఎలాంటి ఇతర కమిట్మెంట్స్ పెట్టుకొవడానికి వీలు లేదు, రాజమౌళి డేట్స్ లాక్ చేస్తే ఖచ్చితంగా హీరోలు అందుబాటులో ఉండాలి.
ఇప్పుడు రాజమౌళి షరతులు మహేష్ విషయంలో వర్తించడం లేదా, రాజమౌళి నే మహేష్ మ్యానేజ్ చేసారా, రాజమౌళి మహేష్ కి లొంగిపోయారా అనేలాంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కారణం రాజమౌళి తో SSMB 29 సెట్స్ లోకి వెళ్ళాక మహేష్ నుంచి ఓ యాడ్ బయటికి రావడమే.
మహేష్ బాబు ఆయన కూతురు సితార తో కలిసి రిలయన్స్ ట్రెండ్స్ కోసం చేసిన యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. రాజమౌళి మహేష్ కి ఎలా అనుమతి ఇచ్చారు ఈ యాడ్ చెయ్యడానికి, రాజమౌళి ని మహేష్ ఎలా మ్యానేజ్ చేసారు అంటూ మహేష్ ఫ్యాన్స్ మాట్లాడుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.