తెలుగు అమ్మాయే అయినా.. ఆమెకి కోలీవుడ్ లో వచ్చిన అవకాశాలు టాలీవుడ్ రాకపోవడంతోనే అంజలి తమిళనాట స్థిరపడింది. అప్పుడప్పుడు తెలుగుకి వచ్చి పలకరించి వెళ్లే అంజలి ఈమధ్యనే గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా మార్కెట్ లో పేరు తెచ్చుకుంది. కానీ గేమ్ చేంజర్ రిజల్ట్ అంజలిని బాగా డిజప్పాయింట్ చేసింది.
ఇక సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా గ్లామర్ షో మొదలు పెట్టిన అంజలి తాజాగా వదిలిన గ్లామర్ పిక్ చూస్తే వావ్ అంజలి లుక్ అంటారేమో. ఫ్లోరల్ ప్రింట్ మోడ్రెన్ వేర్ లో అంజలి ఇచ్చిన ఫోజులకు యూత్ ఫిదా అవ్వాల్సిందే
ఇక అంజలి తెలుగు రైటర్, కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ తో డేటింగ్ చేసింది అనే రూమర్స్ పై ఈమధ్యనే కోన వెంకట్ క్లారిటీ ఇచ్చారు. అంజలి తన పేరెంట్స్ లేకుండా పిన్ని తో కలిసి ఉంది, ఆ సమయంలో ఆమె చాలా ఇబ్బందులు పడింది, ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచాను, ఆమె నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని కుండబద్దలు కొట్టారు.