మహేష్ తో చేస్తున్న SSMB 29 ప్రాజెక్ట్ పై దర్శకధీరుడు రాజమౌళి ఎంత సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నా అన్ని విషయాలు ఆటోమాటిక్ గా బయటికొచ్చేస్తున్నాయి. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఉన్నారనే విషయాన్ని రాజమౌళి రివీల్ చేయకముందే SSMB 29 ఒడిశా షెడ్యూల్ లో పృథ్వీ రాజ్ కనిపించి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చారు.
అంతేకాదు తాజాగా పృథ్వీ రాజ్ SSMB 29 పై పూర్తిగా ఓపెన్ అయ్యారు. తాను మహేష్-రాజమౌళి తో ఏడాది కాలంగా జర్నీ చేస్తున్నట్టుగా చెప్పి షాకిచ్చారు. SSMB 29 ప్రీ ప్రొడక్షన్ లోనే తాను ఉన్నానని, కానీ అవి బయటకి చెప్పకూడదు కాబట్టే ఇప్పటివరకు చెప్పలేదు, అతి త్వరలోనే రాజమౌళి, మహేష్ లతో కలిసి తాను మీడియా ముందుకు వస్తానని చెప్పి SSMB 29 పై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసారు.
మరి రాజమౌళి ఎప్పుడెప్పుడు SSMB 29పై ప్రెస్ మీట్ పెట్టి అప్ డేట్ అందిస్తారో అనే క్యూరియాసిటిలో మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఉన్నారు.