ఆహా అనే యాప్ ఇటీవల కాలంలో బాగా క్లిక్ అయ్యింది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఆ యాప్ కి సబ్ స్క్రైబర్స్ ని పెంచడంలో పెద్ద హెల్ప్ చేసింది. అల్లు అరవింద్ లాంటి వ్యక్తి బ్యాకింగ్ ఉండడం, అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో ప్రమోట్ చెయ్యడంతో ఆహా అనే యాప్ తెగ పాపులర్ అయ్యింది.
ఇప్పుడిక అసలు విషయానికొస్తే గత రెండుమూడు రోజులుగా బెట్టింగ్ యాప్ ల వివాదం ఎంత గట్టిగా ఊపందుకుందో అందరికి తెలిసిందే. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా వంటి హీరోల దగ్గరనుంచి చిన్న చితక సెలెబ్రిటీల వరకు దాదాపు 30 కేసులు నమోదు అయ్యాయి. అందరికి నోటీసులు వెళ్లాయి. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. పోలీస్ యంత్రాంగం సిన్సియర్ గా ఆన్ లైన్ బెట్టింగ్ అనే దరిద్రాన్ని అరికట్టాలని ప్రయత్నిస్తుంది. ఈ దశలో అనుకోకుండా అపవాదు వచ్చి పడింది ఆహాకి.
ఆహా యాప్ లో బెట్టింగ్ యాడ్స్ చూసి, వాటిపట్ల ఆకర్షితుడనై ఆడడం మొదలు పెట్టాను.. నిజంగా డబ్బులొచ్చేస్తాయనే ఆశతో అది స్టార్ట్ చేసిన నాకు మొదట్లో 3 లక్షల వరకు వచ్చాయి. కానీ ఆ తర్వాత అర్ధమైంది నేనొక బావిలోకి దూకానని, నన్నొక ఊబిలోకి లాగారని. కానీ ఇదంతా అర్ధమయ్యేసరికి నేను దాదాపు రూ.80 లక్షలు నష్టపోయి ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. నన్నిలా బెట్టింగ్ యాప్ లవైపు నడిపించిన ఆహా యాప్ కి బాధ్యత లేదా, వారిపై చర్యలు ఉండవా అంటూ ఓ బెట్టింగ్ బాధితుడు మీడియాలో వాపోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
మరి దీనిపట్ల ఆహా యాజమాన్యం స్పందిస్తుందో, స్వయంగా అల్లు అరవిందే సమాధానం ఇస్తారో వేచి చూద్దాం. ఈ ఆరోపణ పోలీస్ యంత్రాంగం సీరియస్ గా తీసుకుంటే ఆహా వారిపై కూడా కేసులు నమోదు అయ్యే అవకాశం లేకపోలేదు.