చంద్రబాబు నాయుడు నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సందర్శించారు. మనవడు దేవానంద్ బర్త్ డే సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న చంద్రబాబు ఆయన సతీమణి ఇంకా కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తిరుమలేసుని నిత్య అన్నదానానికి 44 లక్షల భారీ విరాళం అందించారు.
అంతేకాదు తిరుమల అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించడంతో ఆప్తుగా భక్తులకు వడ్ఢిచారు. భోజనం సమయంలో చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరిలు బజ్జిని పంచుకు తింటున్న వీడియో వైరల్ గా మారింది. భర్త ఆకులో బజ్జి తీసుకుని భువనేశ్వరి అది తుంచి భర్తకు ఒక ముక్క ఇచ్చి ఆమె తినడం చూసిన వారంతా ఆదర్శ దంపతులు అంటూ మాట్లాడుకుంటున్నారు.
దేవాన్ష్ బర్త్ డే రోజున చంద్రబాబు ఫ్యామిలీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీడియోస్, పిక్స్ వైరల్ గా మారాయి.