సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో చేస్తున్నసినిమా షూటింగ్ లో ఉన్నారు. రీసెంట్ గానే SSMB 29 ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు. తాజాగా మహేష్ బాబు చేసిన ట్రెండ్స్ యాడ్ వైరల్ గా మారింది. మహేష్ తన కూతురు సితార తో కలిసి ట్రెండ్స్ షాపింగ్ మాల్ పబ్లిసిటీ కోసం ఓ యాడ్ లో నటించారు.
సితార, మహేష్ ఆ యాడ్లో అద్దరగొట్టేసారు. షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అని మహేష్ అంటే... అవును నాన్నా అంటూ మహేష్ పై ఓ డ్రెస్ విసిరేస్తుంది సితార. అలా ఇద్దరూ సెకండ్ లో పలు డ్రెస్సులు మారుస్తూ రిలయన్స్ ట్రెండ్స్ క్లోతింగ్ ని ప్రమోట్ చేసారు. ఈ యాడ్ లో మహేష్ చాలా హ్యాండ్సమ్ గా కనిపించగా సితార బ్యూటిఫుల్ గా నవ్వుతూ కనిపించింది.
ప్రస్తుతం మహేష్-సితార కలిసి చేసిన ఈ యాడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలోనూ మహేష్ తో సితార జీ తెలుగు కోసం, అలాగే రియల్ ఎస్టేట్ కోసం యాడ్స్ చేసిన విషయం తెలిసిందే.