అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నుంచి ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అనిపించుకుంటుంది. అలా మెల్లగా జాన్వీ కపూర్ పాపులర్ అవుతుంది. ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియా లుక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందాలు ఆరబోసేందుకు జాన్వీ కపూర్ కి ఓ లెక్క ఉంటుంది.
సినిమాల విషయంలో పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించే జాన్వీ కపూర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. ఆమె నటిస్తున్న RC16 చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. రీసెంట్ గానే ఆమె RC 16 సెట్స్ లో అడుగుపెట్టింది.
అయితే జాన్వీ కపూర్ ముంబై లో జరిగిన ఓ వేడుకలో తళుక్కున కాదు గ్లామర్ గా మెరిసింది. రెడ్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో జాన్వీ కపూర్ అచ్చం సాగరకన్యలా కనిపించింది. వెరైటీ హెయిర్ స్టయిల్ తో జాన్వీ కపూర్ రెడ్ లుక్ హాట్ గా యూత్ ని ఆకర్షించడం ఖాయం.