బెట్టింగ్ యాప్ కేసుల్లో బుల్లితెర నటులు, వెండితెర సెలబ్రిటీస్ పై పలు చోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. సజ్జనార్ పిలుపు మేరకు బెట్టింగ్ యాప్స్ నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టారు పోలీసులు. బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిలో ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు చేయగా మరికొంతమంది సెలబ్రిటీల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
కేసులు నమోదైన వారిలో విష్ణు ప్రియా, రీతూ చౌదరిలు నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. దాదాపుగా ఆరు గంటల పాటు వీరిని పోలీసులు విచారించారు. శ్యామల విచారణకు హాజరవ్వకుండా తనపై కేసుని కొట్టు వెయ్యమని శ్యామల తెలంగాణ హై కోర్టుని ఆశ్రయించింది.
Andhra365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని పిటిషన్ వేసిది. దీనిపై ఈ రోజే కోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం.