నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు క్రేజీ హీరోయిన్ గా కాదు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తయారైంది. బాలీవుడ్ లో వరస విజయాలతో అక్కడి స్టార్ హీరోయిన్స్ సరసన చేరిన రష్మిక మందన్న త్వరలోనే అంటే ఈ రంజాన్ కి సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సికందర్ మూవీ లో రష్మిక గ్లామర్ గా దర్శనమివ్వబోతుంది. ఫిట్ నెస్ కి ప్రాధ్యానతనిచ్చే రష్మిక ఛావా రీలీజ్ కి ముందు కాలి కి తగిలిన గాయంతో ఇబ్బంది పడి జిమ్ లో వర్కౌట్స్ చెయ్యలేకపోయింది. తాజాగా జిమ్ లో కష్టపడి చమటలు చిందించిన పిక్స్ షేర్ చేసింది.
జిమ్ లో వర్కౌట్స్ చేసి చేసి అలిసిపోయిన రష్మిక అక్కడ సేద తీరుతున్న ఫొటోస్ ను షేర్ చేసింది. ఆ ఫొటోస్ చూసిన నెటిజెన్స్ జిమ్ లో రిలాక్స్ అవుతున్న నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.