వైసీపీకి అధికార ప్రతినిధి అనే పెద్ద పదవిని కట్టబెట్టిన శ్యామల అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి నాన్న పులి కథ చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల గురించి ఒకటికి రెండు మాట్లాడేసి వెళ్ళిపోతుంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ లోకి హీరో జగన్ మెచ్చుకునేలా చేసుకుని మాజీ ఎమ్యెల్యే రోజా తో సమానమైన హోదాను శ్యామల పొందింది.
జగన్ శ్యామల ను అధికార ప్రతినిధిగా చేసారు. మరి ఇప్పుడు శ్యామలను అధికార ప్రతినిధిగా ఉంచుతారా, లేదంటే ఆమెను తొలగిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. కారణం శ్యామల బెట్టింగ్ యాప్స్ కేసుల వ్యవహారంలో పోలిసుల ఎదుట విచారణకు హాజరవ్వబోతుంది. బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించిన 25 మంది సెలెబ్రిటీస్ కేసులు నమోదు అయ్యాయి.
అందులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉండడం, సాక్షి ఛానల్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారి పేర్లను పదే పదే వేస్తూ ఏకి పడేస్తుంది. అదే వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పేరు మాత్రం వెయ్యడం లేదు. మరి నీతులు చెప్పే శ్యామల ను జగన్ ఏం చేస్తారు. కేసులో ఇరుక్కున్న వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిని ఏం చేస్తారు అనేది వేచి చూడాలి.