Advertisementt

పవన్ కాదు ఎన్టీఆర్ తోనే సినిమా

Fri 21st Mar 2025 10:23 AM
naga vamsi  పవన్ కాదు ఎన్టీఆర్ తోనే సినిమా
Not Pawan but NTR in the movie పవన్ కాదు ఎన్టీఆర్ తోనే సినిమా
Advertisement
Ads by CJ

పవన్ తన చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఎదురు చూడని నిర్మాత లేరు, కోట్లలో అప్పులు తెచ్చి వడ్డీలు కడుతున్న పవన్ నిర్మాతలు ఆ సినిమాలను సక్రమంగా పూర్తి చేసి విడుదల చెయ్యాలని ఆశపడుతుంటే అవేమో వెనక్కి వెనక్కి వెళుతున్నాయి. తాజాగా నిర్మాత నాగ వంశీ పవన్ తో తమ సంస్థలో చేసే 50 వ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ని కుర్ర హీరో సంగీత్ శోభన్ మీరు పవన్ కళ్యాణ్ లేదా ఎన్టీఆర్ ఈ ఇద్దరితో సితార నిర్మాణ సంస్థలో 50వ సినిమా తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్న వెయ్యగా దానికి నిర్మాత నాగవంశీ చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారని కోరుకోవాలి కానీ, సినిమా చేయాలని కోరుకోకూడదు. 

సితార నిర్మాణ సంస్థ లో 50th సినిమా మాత్రం NTR తోనే.. అని నాగవంశీ ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసారు. మరి అందులో నిజం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలంటే అది ఎప్పటికి అవుతుందో తెలియదు, అలాంటి సమయంలో నాగవంశీ ఎన్టీఆర్ ని తన 50 వ సినిమా కోసం ఎంచుకోవడం తెలివైన పనే. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ ఫీలవ్వాల్సిన పనే లేదు. 

Not Pawan but NTR in the movie:

Naga Vamsi Prefers Jr NTR Over Pawan Kalyan

Tags:   NAGA VAMSI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ