ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త జంట నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఇద్దరూ వోగ్ మ్యాగజైన్ కోసం చేయించుకున్న ఫోటో షూట్ మాత్రమే కాదు, వారు ఆ ఇంటర్వ్యూలో తమ ప్రేమ కబుర్లు, పెళ్లి కబుర్లు పంచుకోవడం కూడా ట్రెండ్ అయ్యింది. అటు చైతు తన భార్యతో కలిసి హ్యాపీగా కనిపించాడు.
అదే సమయంలో నాగ చైతన్య మాజీ భార్య, టాప్ హీరోయిన్ సమంత కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం సమంత ఓ ఫ్యాషన్ షో కోసం రెడీ అయిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్లామర్ కి గ్లామర్, అందానికి అందంతో సమంత అందాలు ఆరబోసే తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
బ్లాక్ నెట్ లాంటి డ్రెస్ తో సమంత అందాల ఆరబోత నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. చేతికి ఫ్యాన్సీ ఉంగరాలతో సమంత న్యూ లుక్ మాత్రం తెగ ట్రెండ్ అవుతుంది. అటు చైతు-శోభిత జంట, ఇటు సమంత ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకేసారి ట్రెండ్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.