Advertisementt

తల్లిగా అతి పెద్ద సవాల్ అదే-దీపికా పదుకొనె

Thu 20th Mar 2025 08:29 PM
deepika  తల్లిగా అతి పెద్ద సవాల్ అదే-దీపికా పదుకొనె
Deepika Padukone opened up on mom guilt తల్లిగా అతి పెద్ద సవాల్ అదే-దీపికా పదుకొనె
Advertisement
Ads by CJ

గత ఏడాది బుజ్జి పాపాయికి జన్మనిచ్చిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇప్పుడిపుడే మళ్ళీ బిజీ అయ్యేందుకు సిద్దమవుతుంది. కొద్దిరోజులుగా ఫ్యాషన్ షోస్ లో ర్యాంప్ వాక్ చెయ్యడం, ఫోటో షూట్స్ చేయించుకుంటూ హడావిడి మొదలు పెట్టింది. అయితే ఎప్పుడు సన్నగా ఫిట్ గా కనిపించే దీపిక కూతురు పుట్టాక కాస్త బరువెక్కింది. 

ప్రస్తుతం నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నాను, నా కూతురుతో సమయం గడుపుతున్నాను అని చెప్పిన దీపికా పదుకొనె ఇకపై సినిమా షూటింగ్స్ లో పాల్గొనే విషయంపై ముచ్చటించింది. తల్లిగా సినిమా షూటింగ్స్ లో పాల్గొనడమనేది ఎప్పడు సవాలే. ప్రస్తుతం నా కూతురితో సమయం గడుపుతున్నాను, ఇకపై షూటింగ్స్ లో పాల్గొనేందుకు సిద్ధమవ్వాలి. 

తల్లిగా నా పాప బాధ్యతలు నిర్వర్తిస్తూనే షూటింగ్స్ లో పాల్గొనాలి. ఈ విషయంలో సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఆడవాళ్లు ఉన్నారు, అయినప్పటికి నాకు అది పెద్ద సవాలులా అనిపిస్తుంది. దానిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాను, ఎదుర్కొని నిలబడతాను, మాతృత్వం అనేది గొప్ప అనుభూతి, ఇది నేను ఎంచుకునే సినిమాలపై ప్రభావం చూపుతుంది అని నాకు తెలుసు.  

సినిమాల ఎంపిక విషయంలో తల్లి కాకముందు ఎంత జాగ్రత్త పడేదాన్నో, తల్లి అయ్యాక అంతే జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ దీపికా ఇకపై సెట్స్ లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టుగా చెప్పుకొచ్చింది. 

Deepika Padukone opened up on mom guilt:

Deepika Padukone is figuring out how to return to work 

Tags:   DEEPIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ