Advertisementt

వార్ 2 లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ హైలెట్

Thu 20th Mar 2025 05:49 PM
ntr  వార్ 2 లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ హైలెట్
NTR action scenes in War 2 are a highlight వార్ 2 లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ హైలెట్
Advertisement
Ads by CJ

మగధీరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పిన ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి పంపించు.. అనే పవర్‌ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలోని భారీ యాక్షన్ సీన్ అప్పట్లో ఇండియన్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఇలాంటి ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్ వార్ 2 లోనూ ఉండబోతుందట. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సముద్రం మధ్యలో ఓ భారీ ఓడపై వందమందిపై ఒక్కడే పోరాడే ఫైట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి తగ్గట్టుగా దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ప్రత్యేకంగా ఈ యాక్షన్ సీక్వెన్స్‌ ను ప్లాన్ చేశాడట.

ఈ ఫైట్ ఎపిసోడ్ ఎన్టీఆర్ అభిమానులకు ఊహించనంత భారీగా ఉండబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఎన్టీఆర్ విలన్ టచ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా ప్రతినాయకుడి పాత్రేనా..? లేక ఓ నెగటివ్ షేడ్ ఉన్న పవర్‌ఫుల్ రోల్‌లోనా..? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఎన్టీఆర్ గత చిత్రం దేవర లోనూ గ్రాండ్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కొరటాల శివ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేశాడని సమాచారం.

ఇటీవలే వార్ 2 షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ హైదరాబాద్‌ చేరుకున్నాడు. త్వరలోనే మూవీ టీం నుంచి కొత్త అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సముద్రం నేపథ్యంలోని ఫైట్ సినిమాకి హైలైట్ అవుతుందని టాక్. ఎన్టీఆర్ ఎలివేషన్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ భారీ యాక్షన్ సీన్ థియేటర్లలో ఎంత స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాలి.

NTR action scenes in War 2 are a highlight:

War 2 - Terrific Intro Scenes For NTR and Hrithik

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ