బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ప్రస్తుతం #RC16 (వర్కింగ్ టైటిల్) లో నటిస్తుంది. దేవర చిత్రం తో సక్సెస్ అందుకున్న జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ మరో తెలుగు హీరో రామ్ చరణ్ తో నటించే అవకాశం అందుకుంది. గత ఏడాది పూజ కార్యక్రమాలతో మొదలైన RC 16 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
ఇప్పటివరకు రామ్ చరణ్ పాత్ర తాలూకు చిత్రికరణను చేపట్టిన దర్శకుడు బుచ్చి బాబు ఇప్పుడు చరణ్ ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్ కలయికలో సీన్స్ ని తెరకెక్కిస్తుండడంతో జాన్వీ కపూర్ హైదరాబాద్ వచ్చింది. దానితో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన జాన్వీ కపూర్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.
ఉపాసన అత్తగారు సురేఖ నిర్వహస్తున్న అత్తమ్మాస్ కిచెన్ కి సంబందించిన వస్తువులను ప్యాక్ చేసి గిఫ్ట్ గా జాన్వీ కపూర్ కి అందించిన పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రామ్ చరణ్, జాన్వీ, ఉపాసన ఆర్డర్ బుక్ చేస్తే... ఇవాళ డెలివరీ ఇచ్చినట్టు అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఇంతకీ ఆర్సీ 16 సెట్స్ పై ఏం వండబోతున్నారు... వేచి చూడండి! అంటూ ఆ పోస్ట్ పెట్టారు.