ఏంటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ ఏప్రిల్ నుంచి దసరా కు కాకుండా సెప్టెంబర్ లో రిలీజ్ అంటున్నారు, అసలు రాజా సాబ్ విషయంలో ఏం జరుగుతుంది. ఇంతకీ షూటింగ్ ఎక్కడివరకు వచ్చింది. ఏప్రిల్ నుంచి రాజా సాబ్ పోస్ట్ పోన్ అనేది ఫిక్స్ అంటున్నారు. కానీ అది దసరాకు ఉండొచ్చనే ఊహాగానాలు నడిచాయి.
కానీ ఇప్పుడు రాజా సాబ్ షూటింగ్ ఫినిష్ కాలేదు, అలాగే సీజీ వర్క్ కి సమయం కావాలి, రీసెంట్ గా థమన్ రాజా సాబ్ పాటలన్నీ పక్కనపడేసి కొత్త ట్యూన్స్ ని సిద్ధం చేస్తున్నాని అన్నారు, మారుతి ఎంతగా స్పీడుగా షూటింగ్ ఫినిష్ చేద్దామన్నా ప్రభాస్ సహాకరించడం లేదు, అందుకే షూటింగ్ అంతగా లేట్ అవుతూ వస్తోంది.
ప్రస్తుతం రాజా సాబ్ మేకర్స్ సెప్టెంబర్ లో సినిమాని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారట. సెప్టెంబర్ లో రెండు డేట్స్ ని సెట్ చేసి పెట్టారని, అతి త్వరలోనే అంటే ఏ ఉగాదికో రాజా సాబ్ కొత్త డేట్ పై క్లారిటీ రావొచ్చు అంటున్నారు.