నేహా శెట్టి చేసిన రాధికా కేరెక్టర్ ని ఇప్పుడప్పుడే ప్రేక్షకులు ఎవరూ మరిచిపోరు. డీజే టిల్లు చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ కామెడీ ఎంతగా హిట్ అయ్యిందో, రాధికగా నేహా శెట్టి అందాలు, ఆమె బోల్డ్ నెస్ అంతే ఎక్స్పోజ్ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఆమె చాలా గ్లామర్ పాత్రాలు చేసింది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు.
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ వదులుతుంది. ఈ అందాల భామ ఎంతగా గ్లామర్ ఫొటోస్ వదిలినా అవకాశాలు మాత్రం అవడమే లేదు. తాజాగా నేహా శెట్టి వదిలిన పిక్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. అంతలాంటి గ్లామర్ తో నేహా శెట్టి కనిపించింది.
అది చూసి నెటిజెన్స్ అందాలు ఓకె పాప.. అవకాశాలు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ గ్లామర్ భామను ఏ దర్శకుడైనా కన్సిడర్ చేస్తారేమో చూడాలి.