ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత వెబ్ సీరీస్ లను చూజ్ చేసుకుంటుంది. సౌత్, నార్త్ ఇలా ఏ సినిమా ఆఫర్ ని ఒప్పుకోకుండా సమంత కేవలం వెబ్ సీరీస్ లని ఎంపిక చేసుకుని వాటి షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటో షూట్స్ తో గ్లామర్ గా అద్దరగొట్టే సమంత సినిమాల్లో నటించకపోయినా ఆమె క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు.
సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా సమంత మరోసారి రికార్డ్ క్రియేట్ చేసింది. సక్సెస్ లతో టాప్ లేపుతున్న హీరోయిన్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో సమంత నే ఇష్టపడుతున్నారు, ఆమెనే సెర్చ్ చేస్తున్నారు. అలా ఫిబ్రవరి నెలవరకు మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ ఎవరంటూ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా అనే సంస్థ సర్వే నిర్వహించింది.
ఆ సర్వేలో ఎప్పటిలాగే సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. సమంత తర్వాత ప్లేస్ లో బాలీవుడ్ భామలు అలియా భట్, దీపిక పదుకొనె నిలవగా, ఆతర్వాత స్థానాల్లో సాయిపల్లవి, కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న, త్రిష , నయనతార, శ్రీలీల, అనుష్క శెట్టి నిలిచారు.
ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా మారిన రష్మిక.. ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా సర్వే టాప్ 5లో చోటు దక్కించుకోవడం గమనార్హం