మలయాళ స్టార్ హీరో మమ్ముట్టికి ఏమైంది, మమ్ముట్టికి క్యాన్సర్ అనే ప్రచారంలో ఎంత నిజం ఉంది, మమ్ముట్టికి క్యాన్సర్ సోకడంతోనే ఆయన కొన్నాళ్లుగా బయట కనిపించడం లేదా, స్నేహితుడు ఆరోగ్య రీత్యా మరో స్టార్ హీరో మోహన్ లాల్ శబరిమలై ఆలయంలో మమ్ముట్టి అసలు పేరు మీద ప్రత్యేక పూజలు చేయించారా.. ఇది ఇప్పుడు మమ్ముట్టి అభిమానుల్లో నడుస్తున్న రకరకాల అనుమానాలు.
మమ్ముట్టి కోసం మోహన్ లాల్ శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామికి స్పెషల్ పూజలు చేయిస్తూ మమ్ముట్టి అసలు పేరు మీద అర్చనలు చేయించడం హాట్ టాపిక్ అయ్యింది. మమ్ముట్టికి అనారోగ్య వార్తల నేపథ్యంలో మోహన్ లాల్ పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అయితే ఈవార్తలపై మమ్ముట్టి టీమ్ స్పందించింది. మమ్ముట్టి ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నారు. అందుకే ఆయన బయట కనిపించడం లేదు, ఇంటి వద్దే ఉంటున్నారని చెబుతున్నారు. మరి మమ్ముట్టి ఒక్కసారి అభిమానులకు కనిపిస్తేనే వారి అనుమానాలు తీరతాయి.