ఎస్ ఎస్ రాజమౌళి SSMB 29 సెట్స్ లోకి దిగినంతవరకే లేట్, ఒక్కసారి సెట్ లోకి వెళ్ళాక రాజమౌళి స్పీడు కి హీరోలు బేజార్ అవ్వాల్సిందే. ఎప్పుడు కూల్ గా షూటింగ్ చేసే మహేష్ బాబు కూడా రాజమౌళి తో కలిసి స్పీడు గా పరుగులు పెడుతున్నారు. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ఫినిష్ అయ్యాక ఒడిశా లోని కోరాపుట్ కి సెకండ్ షెడ్యూల్ కోసం వెళ్ళింది టీమ్ .
తాజాగా కోరాపుట్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. దీంతో అక్కడ లోకల్ అధికారులు SSMB 29 టీమ్ ని కలిశారు, అంతేకాదు మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అధికారులు, అక్కడ పనిచేసిన వాళ్ళు ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు.
రాజమౌళి ఎలాంటి అధికారిక అప్ డేట్ ఇవ్వకపోయినా.. కోరాపుట్ లో షూటింగ్ పూర్తి కావడంతో చివరి రోజు రాజమౌళి అక్కడ లోకల్ లో ఉన్న ప్రజలతో కలిసి వాలీబాల్ ఆడిన ఫోటోలు, వీడియోలు ఒడిశా టీవీ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి. దానితో ఒక్కసారిగా అవి వైరల్ గా మారాయి.
ఇక SSMB 29 తర్వాత షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ లోనే వేస్తున్న ఓ భారీ సెట్ లో జరగనుందని సమాచారం.