Advertisementt

అఖండ 2 లో అదే హైలెట్

Wed 19th Mar 2025 11:22 AM
akhanda 2  అఖండ 2 లో అదే హైలెట్
Akhanda 2 To Highlight These Scenes అఖండ 2 లో అదే హైలెట్
Advertisement
Ads by CJ

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. ఈ విజయానికి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. అఘోర పాత్రలో బాలయ్య హిమాలయాల్లో శివలింగానికి అభిషేకం చేసే సన్నివేశంతో ఆయన పాత్ర పరిచయం అవుతుందట. ఈ సీన్‌లో విజువల్స్ అద్భుతంగా ఉండేలా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట.

సినిమా మొత్తం చూస్తే బాలయ్య పరిచయ సన్నివేశమే హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. హిమాలయాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో ఈ అఘోర పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి. అందుకే అఖండ 2 తాండవం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య అఘోర లుక్, అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌లు, గ్రాండ్ విజువల్స్‌తో ఈ చిత్రం మరోసారి సంచలన విజయం నమోదు చేయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Akhanda 2 To Highlight These Scenes:

Akhanda 2 update

Tags:   AKHANDA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ