సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాక బెట్టింగ్ యాప్స్ లాంటి యాప్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఇళ్ళు కొనేసి, కాస్ట్లీ కార్లు కొనేసి బిల్డప్ ఇస్తున్నారు. అలాంటి వాళ్లలో సీరియల్ నటులు, సినిమా హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఒక్కొక్కరిపై కేసులు నమోదు అవుతున్నాయి.
విష్ణు ప్రియా, రీతూ చౌదరి, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, హర్ష సాయి, శ్యామల లాంటి వాళ్లపై కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేరిన ఏ ఒక్కరిని వదలడం లేదు. దానితో ఒక్కొక్కరు వణికిపోతూ మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఇలా అవుతుంది అని మాకు తెలియదు.
ఇకపై ఇలాంటివి చేయమంటూ బ్రతిమిలాడుతూ వీడియోస్ వదులుతున్నారు. తాజాగా శేఖర్ బాషా విష్ణు ప్రియా, టేస్టీ తేజాలు ఇతర కారణాలతో విచారణకు హాజరవ్వలేకపోయారు, వారి తరుపున మరో తేదీని తీసుకోవడానికి నేను వచ్చాను అంటూ చెప్పడమే కాదు, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ విషయంలో వాళ్లు తెలియకే ప్రమోట్ చేశారు.
విష్ణుప్రియకు కనీసం FIR అంటే ఏంటో కూడా తెలియదు, తప్పు తెలిశాక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని వీడియోలు కూడా రిలీజ్ చేశారు, ఇది వాళ్లకు పూర్తిగా కొత్త.. చాలా భయపడుతున్నారు అంటూ మాట్లాడారు.